గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌

అత్యుత్తమ కార్పొరేట్‌ పద్ధతుల్లో భాగంగా సేవలందించేందుకు మరియు వ్యాపార పద్ధతుల్లో పారదర్శకత కల్పించేందుకు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (హెచ్‌ఎఫ్‌సిలు) ఫెయిర్‌ ప్రాక్టీసెస్‌ కోడ్‌పై నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బి) మార్గదర్శకాలు రూపొందించింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిబ్రవరి 17, 2021 తేదీ ఆర్‌బిఐ సర్క్యులర్‌ RBI/2020-21/73 DOR.FIN.HFC.CC.No.120/03.10.136/2020-21ద్వారా జారీచేసిన మాస్టర్‌ డైరెక్షన్‌ నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీ- హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (రిజర్వ్‌ బ్యాంక్‌) నిర్దేశనలు, 2021 అనుసారం, గతంలో దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌గా పిలవబడిన పీరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ యొక్క ఫెయిర్‌ ప్రాక్టీసెస్‌ కోడ్‌ని కంపెనీ సవరించింది. తన కార్యాలయాల్లో ప్రతి ఒక్కదానిలో ఫిర్యాదులు మరియు గ్రీవెన్స్‌లు పొందడానికి, నమోదు చేయడానికి మరియు పరిష్కరించడానికి సదరు మార్గదర్శకాలకు ప్రతి హెచ్‌ఎఫ్‌సికి సిస్టమ్‌ మరియు ప్రక్రియ ఉండాలి.

కాబట్టి, కంపెనీ తనకు అందిన ‘కస్టమర్‌ గ్రీవెన్స్‌లను’ కంపెనీ ఎలా డీల్‌ చేస్తుంది, ఎవరు చేస్తారు, ఎంత కాలం లోపు చేస్తారు అనే వాటిని ఈ పాలసీ డాక్యుమెంట్‌ డీల్‌ చేస్తుంది. ఖాతాదారుల ఫిర్యాదులన్నిటి రికార్డును కంపెనీ సాధ్యమైన రూపంలో నిర్వహిస్తుంది మరియు గ్రీవెన్స్‌లన్నీ వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల వివరాలతో పాటు యాజమాన్యానికి తగిన ఫోరంలో మరియు ఫార్మాట్లో రిపోర్టు చేయబడతాయి.

గ్రీవెన్స్‌ పరిష్కారంపై మా పాలసీ ఈ కింద పేర్కొనబడిన సిద్ధాంతాలను పాటిస్తుంది.

  • ఖాతాదారులను ఎల్లవేళలా బాగా గౌరవించడం జరుగుతుంది.
  • ఖాతాదారులు లేవనెత్తిన ఫిర్యాదులు సౌజన్యంతో మరియు అనవసరమైన జాప్యం లేకుండా డీల్‌ చేయబడతాయి.
  • సంస్థ లోపల తమ ఫిర్యాదులను/గ్రీవెన్స్‌లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళేందుకు గల మార్గాలు మరియు ప్రత్యామ్నాయ పరిష్కారానికి వాళ్ళ హక్కులను ఖాతాదారులకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది, తమ ఫిర్యాదులకు కంపెనీ ఇచ్చిన స్పందనతో వాళ్ళు సంపూర్ణంగా సంతృప్తిచెందకపోతే.
  • ఫిర్యాదులన్నీ సమర్థవంతంగా మరియు న్యాయంగా పరిష్కరించబడతాయి, లేకపోతే అవి మా పేరుప్రతిష్టలను మరియు వ్యాపారాన్ని పాడుచేయవచ్చు.
  • మా ఉద్యోగులు మంచి విశ్వాసంతో మరియు ఖాతాదారుని ప్రయోజనాలకు భంగం కలగకుండా పని చేస్తారు.

గ్రీవెన్స్‌లను అందుకునే పద్ధతులు:

గతంలో దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌గా పిలవబడిన పీరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ఫిర్యాదుల రిజిస్టర్‌ని ప్రతి బ్రాంచ్‌లో అందుబాటులో ఉంచుతుంది మరియు వాటిని సంబంధిత బ్రాంచిలో/ల్లో పరిష్కరించడం జరుగుతుంది. ఇలాంటి గ్రీవెన్స్‌లు వేటినైనా సేకరించే బాధ్యత బ్రాంచ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్స్‌ది మరియు లేవనెత్తిన ఇలాంటి గ్రీవెన్స్‌లను సంతృప్తికరంగా మరియు ఈ పాలసీలో సూచించిన కాల వ్యవధి లోపు పరిష్కరించేందుకు తగిన అధికారుల నుంచి అవసరమైన సహాయం కోరాలి.

అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయం అయితే ఫిర్యాదును సాఫ్ట్‌ కాపీలో నిర్వహించవచ్చు.

వెబ్‌సైట్‌:

రుణగ్రహీత కస్టమర్‌ కేర్‌కి www.piramalfinance.com లో లేదా వెబ్‌సైట్‌లో పేర్కొన్న టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

పరిష్కార ప్రక్రియ:

ఖాతాదారులు ప్రశ్నలు, అభ్యర్థనలు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం మమ్మల్ని మా ఈ-మెయిల్‌ ఐడి (customercare@piramal.com) లేదా టోల్‌ ఫ్రీ నంబరులో (1800 266 6444) సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వబడుతోంది. కస్టమర్‌ సర్వీస్‌ వేళల్లో (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు) బ్రాంచ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ని ఖాతాదారు సంప్రదించవచ్చు. బ్రాంచ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ బ్రాంచ్‌లో కీలకమైన వ్యక్తి, ఖాతాదారుకు సంబంధించిన ప్రశ్నలన్నిటినీ పరిష్కరించేందుకు బాధ్యులవుతారు మరియు దీని కోసం సంబంధిత వ్యక్తుల నుంచి సహాయం మరియు సపోర్టు మరియు దానికి పరిష్కారం కోరతారు.

బ్రాంచ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌/కస్టమర్‌ సర్వీస్‌ మేనేజర్‌ ఖాతాదారులకు సంప్రదింపు వ్యక్తి అవుతారు మరియు అవసరమైన విధంగా ఫిర్యాదుదారు/లతో మాట్లాడాలి.

కంపెనీ యొక్క గ్రీవెన్స్‌ పరిష్కార యంత్రాంగం అవుట్‌సోర్స్‌డ్‌ ఏజెన్సీ ఇచ్చిన సర్వీసులకు సంబంధించిన విషయాన్ని కూడా డీల్‌ చేస్తుంది.

ఏదైనా ఫిర్యాదు పరిష్కారానికి అదనపు సమయం అవసరమైతే, పరిష్కరించడంలో జాప్యం జరగడానికి గల కారణాలను మేము కస్టమర్‌/రెగ్యులేటర్‌కి తెలియజేస్తాము మరియు సమస్యను పరిష్కరించేందుకు ఆశించిన కాల వ్యవధులు ఇస్తారు.

నోడల్‌ ఆఫీసర్‌:

హెడ్‌ - సెంట్రల్‌ ఆపరేషన్స్‌ అండ్‌ కస్టమర్‌ సర్వీస్‌ అనేది ఖాతాదారుని ఫిర్యాదులకు సంబంధించిన విషయాలన్నిటికీ నోడల్‌ ఆఫీసర్‌ మరియు రెగ్యులేటర్‌తో లైజాన్‌ చేస్తారు. గ్రీవెన్స్‌లన్నిటినీ సంబంధిత అధికారులు అతని/ఆమె నోటీసుకు తీసుకురావాలి.

గ్రీవెన్స్‌ పరిష్కారం/నోడల్‌ ఆఫీసర్‌ సంప్రదింపు ఈ కింది విధంగా ఉంటుంది:

ఈమెయిల్‌ ఐడి: nodal.officer@piramal.com

గ్రీవెన్స్‌ పరిష్కార ప్రక్రియ

గతంలో దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌గా పిలవబడిన పీరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో, అత్యుత్తమ కస్టమర్‌ సర్వీస్‌ అందించడానికి మేము ప్రయత్నిస్తాము. మా ప్రోడక్ట్‌లు, సర్వీసులు మరియు పాలసీలు ఖాతాదారుని కేంద్రంగా ప్రధాన విలువ చుట్టూ నిర్మితమయ్యాయి. ఇవ్వబడిన సేవలతో ఖాతాదారులు సంతృప్తి చెందని సందర్భాలు ఉండొచ్చు. ఇలాంటి సందర్భాలను హైలైట్‌ చేయడానికి మరియు ఫిర్యాదును నమోదు చేయడానికి, దయచేసి ఈ కింది ప్రక్రియ పాటించండి:

లెవెల్‌ 01

మా కంపెనీ వెబ్‌సైట్‌ పేర్కొన్న టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా ఖాతాదారు తన ఫిర్యాదును లేవనెత్తవచ్చు లేదా customercare@piramal.com కి ఈమెయిల్‌ చేయవచ్చు లేదా బ్రాంచ్‌ ఆపరేషనల్‌ మేనేజర్‌కి రాయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే ఇది పరిష్కరించబడుతుంది.

లెవెల్‌ 02

ఇవ్వబడిన తీర్మానంతో ఖాతాదారు సంతృప్తిచెందకపోతే, లేదా అతని/ఆమె ప్రశ్న 15 రోజుల లోపల పరిష్కరించబడకపోతే, మాకు grievances@piramal.comకి రాయడం ద్వారా రాతపూర్వకంగా ఖాతాదారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళవచ్చు.

లెవెల్‌ 03

లెవెల్‌ 2లో ఇవ్వబడిన పరిష్కారంతో ఖాతాదారు సంతృప్తిచెందకపోతే లేదా అతని/ఆమె ప్రశ్నలు 15 రోజుల లోపు పరిష్కరించబడకపోతే, ఖాతాదారు ఈ కింది వారికి ఫిర్యాదును పంపవచ్చు:

నోడల్‌ ఆఫీసర్‌- శ్రీమతి హేతల్ పరిహార్

గతంలో దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌గా పిలవబడిన పీరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, 6వ అంతస్తు, అమిటి బిల్డింగ్‌, అగస్త్య కార్పోరేట్‌ పార్క్‌, కమాని జంక్షన్‌, ఫైర్‌ స్టేషన్‌ ఎదురుగా, ఎల్‌బిఎస్‌ మార్గ్‌, కుర్లా (వెస్ట్‌), ముంబయి, మహారాష్ట్ర- 400070.

ఈ-మెయిల్‌:nodal.officer@piramal.com

సంప్రదించవలసిన నంబరు: 022-71740555

లెవెల్‌ 04

ఒకవేళ ఫిర్యాదును ఖాతాదారుని సంతృప్తి మేరకు, పైన తెలిపిన వారి నుంచి సహేతుకమైన కాల వ్యవధి లోపు పరిస్కరించకపోతే, https://grids.nhbonline.org.in/ లింక్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిలో తన ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ యొక్క ఫిర్యాదుల పరిష్కార సెల్‌ని ఖాతాదారు సంప్రదించవచ్చు లేదా ఈ కింది వారికి రాయవచ్చు:

నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌

ఫిర్యాదుల పరిష్కార సెల్‌, డిపార్టుమెంట్‌ ఆఫ్‌ రెగ్యులేషన్‌ అండ్‌ సూపర్‌విజన్‌, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌, 4వ అంతస్తు, కోర్‌ 5ఎ, ఇండియా హాబిటట్‌ సెంటర్‌, లోఢి రోడ్డు, న్యూఢిల్లీ-110 003.

https://grids.nhbonline.org.in/
www.nhb.org.in

సమీక్ష:

పీరమల్‌ ఫైనాన్స్‌ బోర్డు ఎప్పటికప్పుడు పాలసీని మరియు గ్రీవెన్స్‌ల పరిష్కార యంత్రాంగం పనితనాన్ని సమీక్షిస్తుంది.

ఎప్పటికప్పుడు అమలులో ఉన్న నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ యొక్క మార్గదర్శకాలు, నిర్దేశనలు, సూచనలు మరియు సలహాలు అన్నిటికీ కట్టుబడివుంటుంది. ఈ డాక్యుమెంటులోని విషయాలను ఈ మార్గదర్శకాలు, నిర్దేశనలు, సూచనలు మరియు సలహాలు అన్నిటితో కలిపి చదవాలి.