పీరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ పైనాన్స్ లిమిటెడ్, గతంలో దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌గా పిలిచేవారు, ఇక్కడ పీరమల్ ఫైనాన్స్‌గా ప్రస్తావించడమైనది, పీరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (పీరమల్ గ్రూప్ యొక్క ఫ్లాగ్‌షిప్ కంపెనీ) యొక్క పూర్తి సొంత సబ్సిడరీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బి) వద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా రిజిస్టరు చేయబడింది మరియు వివిధ ఆర్థిక సేవల వ్యాపారాలు చేస్తోంది. వివిధ రంగాల్లో హోల్‌సేల్ మరియు రిటైల్ ఫండింగ్ అవకాశాలు కల్పిస్తోంది. రియల్ ఎస్టేట్‌లో, ఈ సంస్థ హౌసింగ్ ఫైనాన్స్ మరియు ప్రారంభ దశ ప్రైవేట్ ఈక్విటీ, స్ట్రక్చర్‌డ్ డెట్, సీనియర్ సెక్యూర్‌డ్ డెట్, కన్‌స్ట్రక్షన్ ఫైనాన్స్ మరియు ఫ్లెక్సీ లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్‌లో పూర్తి క్యాపిటల్ స్టేక్‌లో ఇతర ఫైనాన్సింగ్ పరిష్కారాలు అందిస్తోంది. పీరమల్ ఫైనాన్స్ ఇటీవల ఆతిథ్య రంగం ఫైనాన్సింగ్‌లోకి ప్రవేశించింది. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో బ్రాండెడ్ సంస్థలు నిర్వహిస్తున్న హోటళ్ళకు మేము ఫైనాన్సింగ్ పరిష్కారాలు అందిస్తున్నాము. నాన్ రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో హోల్‌సేల్ వ్యాపారంలో వేరే వెర్టికల్స్ ఉన్నాయి - కార్పొరేట్ ఫైనాన్స్ గ్రూప్ (సిఎఫ్‌జి) మరియు ఎమర్జింగ్ కార్పొరేట్ లెండింగ్ (ఇసిఎల్) ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, రెన్యువబుల్ ఎనర్జీ, రోడ్లు, పరిశ్రమలు, ఆటో కాంపొనెంట్‌లు తదితర లాంటి రంగాల్లోని కంపెనీలకు సిఎఫ్‌జి అనుకూలమైన ఫండింగ్ పరిష్కారాలు అందిస్తోంది, చిన్న మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కి (ఎస్‌ఇఎంలకు) లెండింగ్ ఇవ్వడంపై ఇసిఎల్ దృష్టిపెడుతోంది.
రిటైల్ లెండింగ్‌ని పరిచయం చేయడం కంపెనీ యొక్క ఆర్థిక సేవల వ్యాపారం సైజు, స్కేలు మరియు వృద్ధికి సంబంధించిన సహజమైన పురోగతి. హౌసింగ్ ఫైనాన్స్ యొక్క బలం దాని యొక్క సుసంపన్నమైన అనుభవంలో మరియు హోల్‌సేల్ లెండింగ్ మరియు నిర్మాణ స్థలంలో దానికున్న నెట్‌వర్క్‌లో ఉంటుంది.
పీరమల్ ఫైనాన్స్ తన గ్రూప్ కంపెనీల ద్వారా సిపిపిఐబి, ఎపిజి మరియు ఇవాన్‌హో కేంబ్రిడ్జ్ లాంటి అగ్రగామి అంతర్జాతీయ పెన్షన్ ఫండ్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరియు వ్యక్తిగత యూనిట్లు భారీగా కొనడంపై (పీరమల్ ఫండ్ మేనేజ్‌మెంట్ ద్వారా) దృష్టిపెట్టే అపార్టుమెంట్ ఫండ్ మరియు మురికివాడల పునరుభివృద్ధిపై ఆధారపడి ముంబయి రీడెవలప్‌మెంట్ ఫండ్ లాంటి సంస్థాగత మరియు రిటైల్ ఇన్వెస్టర్‌లకు అనుకూలమైన వ్యూహాలు అందిస్తోంది.